2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు చాలామందే ఉన్నారు. అపోజిట్‌లో బలమైన టీడీపీ అభ్యర్ధులు ఉన్నా సరే కేవలం జగన్‌ని చూసి జనం వైసీపీ ఎమ్మెల్యేలని గెలిపించారు. అలా జగన్ వేవ్‌లో గెలిచిన ఎమ్మెల్యేల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కూడా ఒకరు. అయితే రమేష్‌ గెలుపుకు కేవలం జగన్ ఇమేజ్ ఒక్కటే కారణం కాదు. రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి కూడా ఉంది.


2009 ఎన్నికల్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం తరుపున పోటీచేసిన రమేష్... ఆ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూశారు. అయితే పరాజయం వచ్చిన ఏ మాత్రం క్రుంగిపోకుండా నియోజకవర్గంలోనే పని చేశారు. ఈ క్రమంలోనే తన కష్టానికి అండగా ఉంటుందని వైసీపీలోకి వచ్చి, 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలో దిగారు. అయితే 2014లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడంతో నియోజకవర్గంలోని కాపు ఓట్లు టీడీపీకి అనుకూలంగా మారి మండలి బుద్ధప్రసాద్ స్వల్ప మెజారిటీతో గెలిచారు.


ఇక ఇక్కడ కూడా ఓటమి వచ్చిన రమేష్, వెనక్కి తగ్గలేదు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండే పోరాడారు. చివరికి ఆ పోరాటానికి ఫలితంగానే 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొందారు.   ఇక తొలిసారి ఎమ్మెల్యే అయిన సింహాద్రి..నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. సమస్యలు చెప్పుకోవడం కోసం వచ్చే ప్రజలకు డైరెక్ట్‌గా తన ఇంటికే వచ్చే అవకాశం కల్పించారు. నియోజకవర్గంలోని ప్రధాన గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికి అందేలా చేశారు.


కాకపోతే ప్రభుత్వ పథకాలు తప్పా, ఈ రెండేళ్లలో దివిసీమలో పెద్దగా అభివృద్ధి ఏం జరగలేదు. ఇక రాష్ట్ర స్థాయిలో హైలైట్ కాకపోయిన...లోకల్‌గా సింహాద్రికి మంచి పట్టు ఉంది. నియోజకవర్గంలో సైలెంట్‌గా పనులు చేసుకోవడం వల్ల, రమేష్‌కు ఫాలోయింగ్ బాగా పెరిగింది. అన్నీ వర్గాలని కలుపుకుని వెళుతూ...దివిసీమపై పట్టు పెంచుకుంటున్నారు. అయితే భవిష్యత్‌లో దివిసీమని మరింత అభివృద్ధి చేసి, మరోసారి ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.


అటు టీడీపీ తరుపున మండలి బుద్దప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతానికి ఈయన పెద్ద యాక్టివ్‌గా ఉండటం లేదు. వచ్చే ఎన్నికల్లో బుద్దప్రసాద్ పోటీకి దిగుతారా లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఇలా సరైన నాయకత్వం లేకపోవడంతో అవనిగడ్డలో టీడీపీ వీక్ అవుతుంది. అదే రమేష్‌కు బలం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: