కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త సర్వీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే మహిళలకు శుభవార్త తెలుపుతూ ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీం లో చేరిన మహిళలకు అద్భుతమైన అవకాశాలను కల్పించినది . ముఖ్యంగా మెటర్నిటీ బెనిఫిట్స్ ను ఆన్లైన్లోనే పొందే వెసులుబాటు కల్పించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో చాలామందికి ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆన్లైన్ మెటర్నిటీ బెనిఫిట్ క్లైమ్ ఫెసిలిటీని భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు.


విజ్ఞాన్ భవన్ లో ఇటీవల జరిగిన దత్తో పంత్ తంగడి 102 వ జయంతి సంస్మరణ సభలో ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగిన మహిళలకు టెక్నాలజీ సమయంలో మెరుగైన సేవలు అందించడానికి ఈ ఎస్ ఐ శ్రమిస్తోందని కూడా ఆయన తెలిపారు. అంతేకాదు పోర్టల్ ద్వారా లబ్ధిదారులు సులభంగా ప్రయోజనం పొందవచ్చు అని తెలిపారు. ఇక మహిళ సాధికారతకు ఈ కొత్త సర్వీస్ లను ఉదాహరణగా చెప్పుకోవచ్చని కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ కూడా తెలపడం గమనార్హం. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగిన మహిళలకు మేటర్నిటీ బెనిఫిట్స్ అనేవి క్యాష్ రూపంలో అందుతాయి. గర్భం దాల్చిన తర్వాత డెలివరీ లేదంటే గర్భస్రావం జరిగినప్పుడు నగదు ప్రయోజనం రూపంలో ప్రసూతి ప్రయోజనాలు పొందుతారు.


మహిళలు వెటర్నరీ బెనిఫిట్ కింద 26 వారాల వేతనాన్ని పూర్తి ఉచితంగా పొందవచ్చు. అందువల్ల మహిళలు ఈ విషయాన్ని గుర్తించుకొని ఇకపై మటర్నిటీ బెనిఫిట్ పొందాలని భావించేవారు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. బ్రాంచ్ లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇకపోతే నెలకు రూ.21 వేల వేతనం పొందేవారు ఈఎస్ఐ కింద ఈ ప్రయోజనం పొందుతారు.రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా చాలామంది ఈఎస్ఐ కింద ఈ ప్రయోజనం పొందవచ్చు అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: