తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పేరు ఇప్పుడు మారుమోగుతుంది. దర్శకధీరుడు తెరకెక్కించిన బాహుబలి2 చిత్రం భారీ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. మరో అయిదు సంవత్సరాల వరకూ ఈ రికార్డ్స్ ని టచ్ చేసే సినిమా వస్తుందా? అనే ఆలోచనని అందరి దర్శకుల్లోనూ ఆలోచనలను క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే బాహుబలి2 మూవీ 1000 కోట్ల రూపాయలను టచ్ చేసింది. అంతటితో ఆగక…ఇప్పుడు మరో సరికొత్త రికార్డ్ కి తెరలేపింది.


1000 నుండి 1250 కోట్ల రూపాయల వరకూ వేగంగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇంతటి కలెక్షన్స్ ని బాహుబలి2 చిత్రం కలెక్ట్ చేయటంతో రాజమౌళి పై అంతటా ప్రశంశల జల్లులు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ 1500 కోట్ల రూపాయలను రేపటితో టచ్ చేయనుంది. రీసెంట్ గా పాకిస్థాన్ లో ఈ మూవీ రిలీజ్ అవ్వటం…అక్కడ కూడ కలెక్షన్స్ ఓ రేంజ్ లో రావటంతో బాహుబలి2 కలెక్షన్స్ 1500 కోట్లరూపాయలను త్వరగా పూర్తి చేసుకుంటుంది.


ఇప్పటి వరకూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 900 కోట్ల రూపాయల లోపు కలెక్షన్స్ సాధించిన రికార్డ్ మాత్రమే ఉంది. ఇప్పుడు దానికి మించి 1500 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయటంతో అసలు ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ చేసే అవకాశం ఉందా? అనే ఆలోచన అందరిలోనూ ఉంది. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే 2017లో ఇది జరగని పని డిసైడ్ అయ్యారు.


బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిసి ఏదైనా మాయ చేస్తే కానీ ఈ అరుదైన రికార్డ్ ని బ్రేక్ చేయటం జరగదని అంటున్నారు. ఇక ఇంతటి గొప్ప సినిమా తీసిన రాజమౌళిని సినీప్రేక్షకులు సైతం అభినందిస్తున్నారు. ఈ మూవీ లాంగ్ రన్ లో 1600 కోట్ల రూపాయలను క్రాస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: