యువ నటుడు వరుణ్ సందేశ్ హీరోగా శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్ గా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన కొత్తబంగారు లోకం సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు యువ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న శ్రీకాంత్, ఆ తరువాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్, విక్టరీ వెంకటేష్ ల కలయికలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లలో సిరిమల్లె చెట్టు అనే మల్టీస్టారర్ సినిమాని తీసి మరొక పెద్ద సక్సెస్ అందుకున్నాడు. అనంతరం మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ముకుందా సినిమా తీసిన శ్రీకాంత్, ఆ సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు.  

తరువాత మహేష్ బాబు హీరోగా పివిపి బ్యానర్ పై తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమాతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్న శ్రీకాంత్, అనంతరం కెరీర్ పరంగా భారీ గ్యాప్ తీసుకుని పలువురి నుండి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో నారప్ప సినిమా తీస్తున్నాడు శ్రీకాంత్. ఇటీవల తమిళ్ లో ధనుష్ హీరోగా తెరకెక్కిన అసురన్ అనే సూపర్ హిట్ మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లాక్ డౌన్ కు ముందు చాలావరకు షూటింగ్ ని జరుపుకుంది. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా జాతీయ ఉత్తమ నటి ప్రియమణి నటిస్తుండగా వి క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిషాత్మకంగా నిర్మిస్తున్నాయి.  

అంతకముందు ముకుంద, బ్రహ్మోత్సవం సినిమాలతో పెద్ద పరాజయాలు మూటగట్టుకుని ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీకాంత్, తన పై విమర్శలు చేసేవారికి, అలానే పిచ్చి కూతలు కూసేవారందరికీ నారప్ప సినిమా సక్సెస్ తో సమాధానం చెప్పాలని చూస్తున్నాడట. ఏది ఏమైనా కెరీర్ ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడితే ప్రతి ఒక్కరూ విమర్శలు చేయడం మొదలెడతారని, అందుకే నారప్ప సినిమాతో గట్టిగా హిట్ కొట్టి సమాధానం చెప్పాలని చూస్తున్న శ్రీకాంత్ ఆవేదన సబబేనని అంటున్నారు విశ్లేషకులు ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: