తెలుగు సినిమా రంగంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటేనే ఎంత సంచ‌ల‌న‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు హిట్టు... ప్లాపుల‌తో సంబంధం లేకుండా ప‌వ‌న్ తెర‌మీద క‌నిపిస్తేనే జ‌నాలు చెవులు కోసుకునేంత అభిమానం చూపిస్తారు. ప‌వ‌న్ సినిమాలు డిజాస్ట‌ర్లు అయినా కూడా తొలి రోజే ఏకంగా రు. 50 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌డ‌తాయి. అజ్ఞాత‌వాసి - కాట‌మ‌రాయుడు - స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ఇలా ఏ ప్లాప్ సినిమా అయినా కూడా తొలి రోజే ఏకంగా రు. 50 కోట్ల షేర్ రావ‌డం ప‌వ‌న్ స్టామినాకు నిద‌ర్శ‌నం. ఇక ప్లాపుల‌తో సంబంధం లేకుండా ప‌వ‌న్‌కు భారీ రెమ్యున‌రేష‌న్లు ఇచ్చేందుకు నిర్మాత‌లు ముందుకు వ‌స్తుంటారు.

అజ్ఞాత‌వాసి త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ప‌వ‌న్ ప్ర‌స్తుతం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌కీల్ సాబ్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ వ‌రుస పెట్టి సినిమాలు అంగీక‌రిస్తున్నాడు. క్రిష్ - సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రెండు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పాడు. ఇక మ‌ళ‌యాళ రీమేక్‌ సినిమాలో రానాతో క‌లిసి న‌టిస్తున్నాడు. ఇక ప‌వ‌న్‌కు ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా క్రేజ్ త‌గ్గ‌దు స‌రిక‌దా ?  రెమ్యున‌రేష‌న్ కూడా పెరుగుతూనే ఉంటోంది.

ప‌వ‌న్ వ‌కీల్ సాబ్‌కు దిల్ రాజు ద‌గ్గ‌ర రు. 50 నుంచి రు. 55 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్నాడ‌ట‌. ఇక క్రిష్ సినిమా, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ తాళ్లూరి నిర్మించే సినిమాల‌తో పాటు ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ కు కూడా ఓకే చెప్పేశాడ‌ని అంటున్నారు. ఇక అయ్య‌ప్ప‌న్ కోషియ‌ర్ రీమేక్‌, హ‌రీష్ శంక‌ర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఒక్కో సినిమాకు స‌గ‌టున రు. 50 కోట్లు వేసుకుంటే ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖ‌రీదు ఏకంగా రు. 300 కోట్ల పై మాటే అని తెలుస్తోంది.

కేవ‌లం రెమ్యున‌రేష‌న్ల రూపంలోనే రు. 300 - రు. 350 కోట్లు అత‌డికి ముట్టునున్నాయి. ఇక త‌మ అభిమాన హీరో ఒకేసారి ఆరు సినిమాల‌ను లైన్లో పెట్ట‌డంపై కూడా ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: