సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గీత గోవిందం దర్శకుడు పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ మూవీ సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈ సినిమాకు తొలి షెడ్యూల్ దుబాయిలో ఎంతో గ్రాండ్ లెవెల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ ల తో పాటు పలు ఇతర తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తోందట యూనిట్. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫీని అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి దీనిని ఎంతో భారీగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై సూపర్ స్టార్ ఫాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటూ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా అధికారిక ప్రకటన చేశారు. ఇక దీని తర్వాత ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీ చేస్తున్న రాజమౌళి దాని అనంతరం తదుపరి సినిమా మహేష్ బాబు తో నే అంటూ ఇటీవల ప్రకటించడం జరిగింది. ప్రముఖ నిర్మాత కె.ఎల్ నారాయణ నిర్మాణంలో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా ఎంతో గ్రాండ్ లెవల్లో తెరకెక్కనున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ సినిమా కోసం ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారని అతి త్వరలో అది పూర్తయిన వెంటనే దీనికి సంబంధించి అధికారికంగా న్యూస్ కూడా బయటకు రానుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహమాన్ తీసుకునేందుకు దర్శకుడు రాజమౌళి ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. స్క్రిప్టు పరంగా పలు యాక్షన్ ఎమోషన్స్ తో కూడిన ఈ కథకి ఏ.ఆర్.రెహమాన్ పర్ఫెక్ట్ అని యూనిట్ కూడా భావిస్తోందని టాక్. మరి ఇప్పటి వరకు తన సినిమాలకు వరుసగా తన అన్నయ్య కీరవాణి ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటూ వస్తున్న రాజమౌళి నిజంగానే తదుపరి మహేష్ బాబు సినిమా కోసం రెహమాన్ ని తీసుకుంటున్నారా లేదా ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: