మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మరొక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దీనిని ఎంతో భారీ గా గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు.

1920ల కాలం నాటి కథగా పెట్రియటిక్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, అలానే ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ మూవీ ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది. అయితే దీని తరువాత ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రాం చరణ్ హీరోగా దిల్ రాజు ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న సినిమా యొక్క అధికారిక ప్రకటన నేడు కొద్దిసేపటి క్రితం వచ్చింది. భారీ యాక్షన్ సినిమాగా ఒక డిఫరెంట్ బాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ మూవీ లో రాం చరణ్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని, అలానే తన మార్క్ తో పాటు కొంత కమర్షియల్ హంగులు కూడా కలగలిపి దర్శకుడు శంకర్ ఈ మూవీని ఎంతో భారీ గా తీయనున్నారని అంటున్నారు.

కాగా ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒకరు వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో ఎంతో వైరల్ అవుతోంది. దానిని బట్టి ఈ భారీ మూవీకి సంగీత దర్శకుడిగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ పాటలు అందించనున్నారని అంటున్నారు. అలానే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్రలు చేయనున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త లో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై యూనిట్ నుండి అధికారిక న్యూస్ బయటకు రావాల్సిందే......!!

మరింత సమాచారం తెలుసుకోండి: