బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ పై ఎప్పటి నుంచో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. బాలయ్య కూడ తన కొడుకు హీరో ఎంట్రీ ఖాయం అని చెపుతూనే అది ఎప్పటి నుంచి అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు. మంచి దర్శకుడు మంచి కథ దొరకాలి అని మాత్రం చెపుతూ ఉంటాడు.


ఇలాంటి పరిస్థితులలో బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ‘ఉప్పెన’ మూవీని ప్రత్యేకమైన షో వేయించుకుని చూసి ఆమూవీ డైరెక్టర్ బుచ్చిబాబు పై విపరీతమైన ప్రశంసలు కురిపించడం వెనుక మోక్షజ్ఞ ఎంట్రీ ఉద్దేశ్యం ఉందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవానికి బాలయ్య తన సినిమాలు తన తండ్రి సినిమాలను తప్పించి బయట సినిమాలను ఎంత బాగున్నా పొగడడు.


అయితే దీనికి భిన్నంగా బాలయ్య తీరు కనిపిస్తోంది అని అంటున్నారు. మోక్షజ్ఞ ను హీరోగా చేసి ఒక మాదిరి బడ్జెట్ తో ఒక లవ్ స్టోరీ సినిమా తీయాలని బాలయ్య ఆలోచన. ఈ ఆలోచనలకు స్పందించి టాప్ దర్శకులు ఎవరు ముందుకు రావడంలేదు. దీనితో టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ పై బాలకృష్ణ తన దృష్టి పెట్టాడు. ఇలాంటి పరిస్థితులలో బాలయ్య దృష్టి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు పై పడింది అని అంటున్నారు.


ఈ మూవీకి విమర్శకుల ప్రశంసల నుండి ఘన విజయం కూడ రావడంతో బుచ్చిబాబు సహకరిస్తే మోక్షజ్ఞ ను అతడి చేతిలో పెట్టాలని బాలయ్య ఆలోచన అని టాక్. మరొకవైపు నాగార్జున కూడ అఖిల్ ను బుచ్చిబాబు చేతిలో పెట్టాలని ఆలోచిస్తున్న పరిస్థితులలో ఈ వారసుల భారాన్ని బుచ్చిబాబు ఎంతవరకు తీసుకుంటాడు అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. పరిస్థితులు ఇలా ఉంటే ఈ వీకెండ్ కూడ ‘ఉప్పెన’ హవా కొనసాగడంతో ఈమూవీ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయి మరోసంచలనం సృష్టించి బుచ్చిబాబు మ్యానియాను మరింత పెంచే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: