చందమామ  రావే.. జాబిల్లి రావే.. కొండెక్కి రావే.. గోగి పూలు తేవే.. బండెక్కి రావే.. బంతి పూలు తేవే.. అంటూ చిన్నప్పుడు అమ్మ నిండు జాబిల్లిని చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన సందర్భాలు ఎన్నో.. ఒక్కసారి ఆ మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుంటే, ఎంత బాధ అయినా సరే ఇట్టే మాయమైపోవాల్సిందే.. అయితే చిన్నప్పుడు నిండు జాబిలి దగ్గర మనం ఎప్పుడూ మనకు నచ్చినట్టుగానే ఉంటాము. కానీ పెద్దయ్యాక అవన్నీ కుదరవు. చాలామందికి నిండు జాబిలి లో హాయిగా డాన్స్ చేయాలని, తమకు నచ్చినట్టుగా ఉండాలని ఎంతో మంది యువత కలలుకంటూ ఉంటారు. అయితే అలా తమకు నచ్చినట్టుగా తాము ఉండడం వల్ల, చూసిన పక్క వాళ్ళు ఏమనుకుంటారో అన్న సందేహంతో, తమ కోరికలను అణుచుకుంటూ ఊహలలో బతికేస్తూ ఉంటారు..



అయితే ఇక్కడ ఒక ముద్దుగుమ్మ మాత్రం తనను తాను మైమరచిపోయి చంద్రుడి ముందు హాయిగా నృత్యం చేస్తోంది. ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆ హీరోయిన్ తనకు వచ్చినట్టుగా, నచ్చినట్టుగా నిండు చంద్రుని ముందు హాయిగా డాన్స్ చేస్తోంది . ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అని ఆలోచిస్తున్నారా? అయితే ఆ ముద్దుగుమ్మను మీరే గుర్తుపట్టాలి మరీ.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది.. అంతే కాదు తన నటనతో ప్రేక్షకులను అందరినీ మంత్రముగ్ధులను చేయగల శక్తి కూడా ఈమెలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.


హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో పేరుని ఆంగ్లంలో రెండుక్షరాలతో కుదించి చెబితే ఏ అక్షరాలైతే వస్తాయో.. ఈ హీరోయిన్ పేరు కూడా అవే ఆంగ్ల రెండక్షరాలను కలిగి ఉంటుంది.ఆ ముద్దగుమ్మా ఎవరో కాదు.. పూనమ్ కౌర్..అంతేకాదు.. ఈ హీరోయిన్ చేసే ట్వీట్స్.. ఆ స్టార్ హీరో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రిలేటెడ్‌గా ఉంటాయని నెటిజన్లు చెప్పుకుంటూ ఉంటారు. పూనమ్ కౌర్ నిండు చంద్రుడిని చూస్తూ, తనని తాను మైమరచిపోతూ పండువెన్నెల్లో చేసిన డాన్స్ వీడియోను  సోషల్ మీడియాలో  షేర్ చేయగా అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: