చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే మన భారతదేశంలో విడాకులు అనేది చాలా పెద్ద విషయంగా చూసేవారు. చాలా వరకు ఏదైనా జంట విడాకులు తీసుకోవాలి అనుకున్నట్లయితే వారిని కూర్చో బెట్టి పెద్ద వారు అలా కాదు విడిపోకూడదు అని ఎన్నో మంచి మాటలు చెప్పి వారిని కలిపేవారు. ఆ తర్వాత అలా కలిపిన వారు కూడా చాలా శాతం వరకు కలిసి మెలిసి జీవితం మొత్తం కొనసాగించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. ఎవరైనా విడాకులు తీసుకోవాలి అనుకున్నట్లయితే వారు ఎవరు చెప్పినా వినకుండా తమ నిర్ణయాన్ని ఫాలో అవుతున్నారు.

అలాగే కొంత మంది పెళ్లి అయిన తర్వాత జరిగే చిన్న చిన్న గొడవలకు కూడా విడాకులు తీసుకొని వేరవుతున్నారు. ఇకపోతే తాజాగా ఓ సర్వే ప్రకారం విడాకుల ద్వారా మగవారు ఒక రకమైన సమస్యను ఎదుర్కొంటే , ఆడవారు మరో రకమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ సర్వే ప్రకారం ... విడాకులు తీసుకున్న సందర్భంలో మగ వారు అమ్మాయిలకు ఇచ్చే భరణం కోసం అనేక అప్పులను చేస్తున్నట్లు , అలా విడాకుల కోసం మగ వారు ఎంతో మంది అప్పులు చేసి అప్పులలో కూరుకుపోతున్నట్లు , అలా 42 శాతం మంది వరకు విడాకులు తీసుకొని అమ్మాయిలకు ఇచ్చే భరణం కోసం అప్పులు చేస్తున్నట్లు, దానితో వారు అప్పుల బాధలో కూరుకుపోతున్నట్లు ఓ సర్వే చెబుతుంది.

ఇక ఆడవారి విషయానికి వస్తే దాదాపు 70 శాతం వరకు విడాకులు తీసుకున్న వారిలో మొదట భర్తతో కలిసి జీవించిన స్థాయి జీవితాన్ని గడపలేక వారు కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇలా తాజా సర్వే ప్రకారం విడాకుల తర్వాత అబ్బాయిలు అప్పుల బాధలో కూరుకుపోతూ ఉంటే , అమ్మాయిలు భర్తతో కలిసి ఉన్న సమయంలో అనుభవించిన స్థాయి జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: