విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం స్టార్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్న సీనియర్ స్టార్ హీరో అని చెప్పవచ్చు. తన సినిమాలతో నాటి నుంచి నేటి వరకు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటూ, సినిమా రంగంలో రాకెట్ లా దూసుకుపోతున్నారు. ఇక ప్రస్తుతం నారప్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూ, ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో ఆర్థిక క్షోభ ఏర్పడడంతో, ఆయన తన రెమ్యునరేషన్ ను  కూడా తిరిగి ఇచ్చేస్తున్నట్లు చెప్పడం కూడా జరిగింది. చిత్ర నిర్మాతలు అప్పుల బాధలలో  కూరుకుపోయారనే  భయంతోనే ఆయన తన రెమ్యూనరేషన్ ను  కూడా తిరిగి ఇస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే  వెంకటేష్ నటించిన ఒక సినిమాకు దాదాపు 28 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ముగిసాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..

విక్టరీ వెంకటేష్ సాధారణంగా కాంట్రవర్సీ లకు దూరంగా ఉంటాడు. కానీ ఆయన నటించిన కొండపల్లి రాజా సినిమా మాత్రం కాంట్రవర్సీ లకు గురి అవడంతో పాటు విమర్శల పాలు కూడా అయింది. కానీ అన్ని సమస్యలను దాటుకుంటూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా  నిలిచి, సూపర్ హిట్  విజయాన్ని వెంకటేష్ ఖాతా లో  చేరవేసింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కొండపల్లి రాజా సినిమా అప్పట్లో కాంట్రవర్సీ కి  కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక ఊహించని విధంగా విడుదల తర్వాత ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిత్రం.


ఈ సినిమాలో  సుమన్ మరో హీరోగా నటించాడు. అయితే తమిళ్ సినిమా అయినా "అన్నామలై " సినిమాకు రీమేక్ గా తెలుగులో చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే, ఈ సినిమా హిందీలో శత్రుఘ్నసిన్హా, జితేంద్ర లు కలిసి నటించిన "ఖుద్ గర్జ్" సినిమా నుంచి రీమేక్ చేయబడినది. కానీ ఈ సినిమాను శరత్ బాబు , కృష్ణంరాజు  ఇద్దరూ కలిసి ప్రాణస్నేహితులు సినిమా గా తెరకెక్కించగా, తిరిగి  తమిళ్ లో  ఈ సినిమాలో శరత్ బాబు, రజనీకాంత్ కలిసి అన్నామలై చిత్రంగా రీమేక్ చేశారు. సినిమా తమిళ్ లో కూడా  మంచి సూపర్ హిట్ ను అందుకుంది.


కానీ అప్పట్లో ఈ సినిమాను  తమిళ్ లో రీమేక్ చేస్తున్నప్పుడు,  కృష్ణంరాజు ప్రాణ స్నేహితులు సినిమా తీశారు. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి హక్కులు మా నుంచి  తీసుకోలేదని ఆయన కోర్ట్ కు ఎక్కారు. కానీ తిరిగి దర్శక నిర్మాతలు, హీరోలు రాజీ పడడంతో వివాదం చివరికి ముగిసిపోయింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ తో రవిరాజా పినిశెట్టి,  వెంకటేష్ హీరోగా నగ్మా హీరోయిన్ గా ఈ సినిమాలో కొండపల్లి రాజా గా చిత్రీకరించారు . ఇక ఇన్ని  విమర్శల పాలైన  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడం మరో విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: