సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటారు. గత కొన్ని రోజులుగా చిన్మయి చాలా దారుణమైన ట్రోలింగ్ కు గురవుతున్నారు. నెటిజన్లలో కొంత మంది ఆమెను ఇష్టమొచ్చినట్లు తిడుతూ రెచ్చగొడుతున్నారు. అందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ దారుణమైన అసభ్యకరమైన సందేశాలను చిన్మయి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. తాజాగా తనకు వచ్చిన అసభ్య సందేశాలు పై చిన్మయి శ్రీపాద మాట్లాడారు. అసలు ఇంతల చిన్మయి మీద ట్రోలింగ్ జరగడానికి కారణం.  లక్నో గర్ల్ సంఘటన మీద చిన్మయి స్పందించారు. ఆ అమ్మాయి చేసింది తప్పు, ఆమె అలా నడిరోడ్డుమీద ప్రవర్తించాల్సిన అవసరం లేదు అని క్యాబ్ డ్రైవర్ కు మద్దతుగా స్పందించారు. కానీ చిన్మయి ఈ విషయాన్ని ఇంగ్లీషులో రాసుకొచ్చింది. ఈ విషయంలో అసలు మ్యాటర్ అర్థం కాని కొంతమంది మీమర్స్ మాత్రం చిన్మయి పై నెగటివ్ గా రాసుకొచ్చారు. ఎలాగో చిన్మయి ఫెమినిస్టు కదా..? లక్నో గార్లకు మద్దతుగా రాసింది ఏమో అని భావించారు ఏమో..చిన్మయి ని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సదరు మిమ్మల్ని అడిగితే మీ పోస్టు చదవలేదు.. నాకు ఇంగ్లీష్ రాదు అని జవాబు ఇచ్చాడట. అలా తన పోస్టులు చదవకపోయినా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారంటూ చిన్మయి మీమర్స్‌ను టార్గెట్ చేసింది.


 కొన్ని మీమ్స్ పేజీల మీద చిన్మయి సెటైర్లు వేశారు. అయితే ఇలా మీమర్స్ మీద కౌంటర్లు వేయడంతో ఒక వ్యక్తి చిందులు తట్టాడు. చిన్మయి నీ తెలుగులో పచ్చి బూతులతో దారుణంగా తిట్టాడు. రేప్ చేస్తాను అని కూడా బెదిరించాడు. ఇలా పచ్చి బూతులతో , అసభ్యమైన మాటలతో, బెదిరిస్తూ నెటిజన్ చేసిన మెసేజ్లను చిన్మయి శ్రీపాద స్క్రీన్ షాట్ ని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: