తొలి చిత్రం లోనే ద్విపాత్రాభినయం
రంగస్థ లం నేపథ్యం గల నటీనటులంతా కాలగమనంలో సినీరంగం లోకి అడుగు పెడతారు.  కళారంగం పై ఉన్న మక్కువతో  ఏళ్ల తరబడి సినిమా స్టూడియోల చుట్టూ తిరిగి తిరిగి ఎట్టకేలకూ సినిమాల్లో వేషాలు సంపాదిస్తారు. ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు తదితరులంతా ఈ కోవలోనే చిత్రరంగం లోకి వచ్చారు.  దాదాసాహెబ్ ఫాల్కే \అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వ ర రావు  నాటక రంగంలో  ఆడవేషాలు వేసి సినీరంగంలో చోటు సంపాదించారు. ఇదీ చలన చిత్ర పరిశ్రమ లో ఆది నుంచి జరుగుతున్న ప్రహసనం. దాదాపు ముప్పై ఏళ్లకు పైగా ట్రండ్ క్రమంగా మారుతోంది. సినీరంగంతో  పరిచయం ఉన్న వాళ్లు,  సినీరంగ వారసులు నేరుగా మూవీ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు.  తరువాత సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నారు.
 రెండో రకం నుంచి  సినీరంగంలో అడుగు పెట్టి దక్షిణ బారత దేశ సినీ పరిశ్రమలో తన కంటూ ఓ స్థానం సంపాదించుకున్న నటుడు జగపతి బాబు. అలియాస్ వీరమాచనేని జగపతి చౌదరి. ఈయనది పాతికేళ్లకు పైగా సాగుతున్న సినీ ప్రస్థానం. తండ్రి వారసత్వాన్ని ఎక్కడా పుణికి పుచ్చు కోని విలక్షణ నటుడు ఈయన.  జగపతి బాబు తండ్రి ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు వి.బిరాజేంద్ర ప్రసాద్. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఎన్నో జనరంజక చిత్రాలు వచ్చాయి.
 1989 లో సినీరంగ ప్రవేశం చేసిన జగపతి బాబు  తోలి చిత్రం లోనే  ద్విపాత్రాభినయం చేశారు.   సింహ స్వప్నం ఈయన తొలి సినిమా.  ఇందులో కవల పిల్లల పాత్ర పోషించారు . ఖత్రోంకే ఖిలాడి హిందీ సినిమా కు  సింహ స్వప్నం రీమేక్. ఇది బాక్సాఫీసు వద్ద అనుకున్నంత లాభాలు ఆర్జించ లేదు. అట్లాఅని ప్లాప్ షో కాలేదు. తెలుగు చలన చిత్ర  చరిత్రలో మాత్రం తొలి సినిమాలోనే డబుల్ రోల్ చేసిన నటుడిగా ఈయన చరిత్రలో నిలిచి పోయారు.
దాదాపు వందకు పైగా సినిమాలలో నటించి ఈయనకు  హీరో గ్లామర్ కన్నా విలక్షణ నటుడుగా పేరుంది. ఉత్తమ నటుడిగా,   ఉత్తమ సహాయ నటుడిగా ఇలా విభిన్న అంశాలలో ఈయన  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏడు  సార్లు నంది పురస్కారాలు అందుకున్నారు. మావి చిగురు సినిమాతో ఈయన తొలిసారి నంది పురస్కారాన్ని అందుకున్నారు.   జగపతి బాబు నటించిన మనోహరం, గాయం,  చిత్రాలలో ఉత్తమ నటుడుగా నంది పురస్కారం లభించింది.  శ్రీకారం, అడవిలో అభిమన్యుడు చిత్రాలను స్పెషల్ జ్యూరీ కేటగిరీలో నంది అవార్డు అందుకున్నారు.  అంతఃపురం,  లక్ష్యం  చిత్రాల ద్వారా ఉత్తమ సహాయ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు.
 కాలగమనంలో తో పాటు,  వయసు పెరుగుతుండటంతో హీరో పాత్రల స్థానంలో  ఈయన ప్రతి నాయకుడి పాత్రలలోనూ,  క్యారెక్టర్ ఆర్థిస్టు గానూ స్థిర పడ్డారు.  జగపతి బాబు  ఏ సినిమాలో ఏ పాత్ర పోషించినా  ఆ సినిమాకు మినిమం గ్యారంటీ అనే సెంటిమెంట్ చిత్ర పరిశ్రమలో నాటుకు పోయి ఉండటం గమనార్హం.






మరింత సమాచారం తెలుసుకోండి: