పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక సమయంలో మంచి సాలిడ్ హిట్ అవసరం చాలా పడింది. ఖుషి తర్వాత అంతా రేంజ్ హిట్ కోసం ఆయన అభిమానులు ఎంత ఎదురుచూసారో అందరికి తెలిసిందే. అలాంటి సమయంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్ . ఈ సినిమా అప్పట్లో వచ్చిన రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టి పవన్ కళ్యాణ్ ని మళ్ళీ టాప్ రేస్ లో నిలబెట్టింది.

హిందీ లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్ రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ అభిమానులని తలెత్తుకునేల చేసింది. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన మున్నీ బాధానం పాట ని కాపీ కొట్టకుండా దేవి శ్రీ ప్రసాద్ కెవ్వు కేక పాటని ట్యూన్ చేసాడు. ఈ పాట సినిమా విడుదల అవ్వకముందే చార్ట్ బస్టర్ అయ్యింది. ఇక 2012 లో గబ్బర్ సింగ్ రిలీస్ అయ్యాక థియేటర్స్ లో ఫాన్స్ అందరికి ఈ పాట పిచ్చి ఎక్కించింది అని చెప్పాలి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత పవన్ మాస్ స్టెప్స్ వేస్తుంటే ఆయనతో కలిసి అభిమానులు కూడా డాన్స్ వేశారు.

సినిమా ఐటమ్ సాంగ్ చేసింది కూడా హిందీలో మున్నీ బాధానం పాటకి స్టెప్స్ వేసిన మలైకా అరోరా అవ్వడం విశేషం.గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ఈ పాట కూడా ఒక కారణమే అని చెప్పొచ్చు. ఈ ఒక్క పాటనే కాకుండా ఈ సినిమాలో మిగతా పాటలు కూడా చాలా బాగుంటాయి. దేవి శ్రీ ప్రసాద్ అసలు హిందీ ఒరిజినల్ పాటలకు ఎలాంటి సంబంధం లేకుండా పాటలన్ని అందించారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ లో ఇంకొక సినిమా రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: