సంక్రాంతి వచ్చిందంటే సినిమాల హంగామా మాములుగా ఉండదు. కొత్త సినిమాలు సందడి చేస్తాయి. గత ఏడాది కూడా చాలా మంది హీరోల సినిమాలు విడుదల అయ్యి మంచి టాక్ ను అందుకున్నాయి. కరోనా కారణంగా నిబంధనలను అనుసరిస్తూ సినిమాలు ఆడాయి. కరొన తగ్గిన తర్వాత చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి హీరో చేతిలో నాలుగు ఐదు సినిమాల తో బిజిగా ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. 


మూడు నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమాలు ప్రమోషన్స్ లో బిజిగా ఉన్నాయి. మొన్నటివరకూ మూడు సినిమాలు బరిలో ఉన్నాయి. ఇప్పుడు ఒక సినిమా విడుదల తెదీని వాయిదా వేసుకుంది. ఇప్పుడు రెండు సినిమాలు మాత్రమే బరిలో ఉన్నాయని తెలుస్తుంది. జనవరి 7న ట్రిపుల్ ఆర్ చిత్రం విడుదల కానుంది.14న ప్రభాస్ రాదే శ్యామ్ విడుదల కానుంది. అయితే కొన్ని కారణాల వల్ల బంగార్రాజు విడుదల కానుంది.



భీమ్లా నాయక్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ అనుకున్నారు. కానీ అనివార్య పరిస్థితుల వల్ల ఇది వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాలి.. మొత్తానికి చూసుకుంటే నేషనల్ వైడ్ కలెక్షన్స్ పరంగా ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వీరిద్దరికీ తోడు అక్కినేని హీరోల సినిమా బరిలో కి దిగనుంది. ట్రిపుల్ ఆర్ చిత్ర ప్రమోషన్స్ కోసం స్టార్ హీరోలును దించుతున్నారు జక్కన్న.. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫిస్ వద్ద ఎలాంటి రికార్డు లను కైవసం చెసుకుంటాయో చూడాలి. మరో వైపు కరోనా వేరియంట్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది.. నిబందనల తో సినిమాలను విడుదల చేయాలనీ ప్రభుత్వం సూచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: