అక్కినేని నాగచైతన్య ఇటీవల లవ్ స్టోరీ సినిమాతో విజయం అందుకొని మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఆయన హీరోగా ప్రస్తుతం చేస్తున్న థాంక్యూ చిత్రం తప్పకుండా లవ్ స్టోరీ చిత్రం లాగానే ఆకట్టుకుంటుందని భావిస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా కావడం విభిన్నమైన టైటిల్ విభిన్నమైన స్టోరీ కావడంతో ఈ సినిమా పై చైతు లో నమ్మకం ఏర్పడింది. రాశికన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో ఆమె మంచి గ్లామరస్ పాత్ర చేస్తుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య వరుస సినిమాలు ఒప్పుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఆయన సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె ఓ బేబీ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా ఆ తర్వాత ఇప్పటి వరకు ఆమె ఏ సినిమా కూడా మొదలుపెట్టనే లేదు. దాంతో ఇప్పుడు నాగచైతన్యతో ఓ సినిమా చేసి మళ్లీ ఫామ్ లోకి రావాలని ఆమె భావిస్తుంది. ఈ విధం గా నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగచైతన్య సినిమా చేయడం దాదాపు ఖరారు అయిందని అంటున్నారు. 

అలాగే ఇటీవల నాంది లాంటి సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాగచైతన్యసినిమా చేయడానికి అంగీకరించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ఆసక్తికరమైన కథను వినిపించగా అది ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఒప్పుకొని తొందరలోనే మొదలు పెట్టాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు వలస సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్న నేపథ్యంలో అక్కినేని నాగచైతన్య కూడా ఆ విధంగా అడుగులు వేస్తూ వరుస సినిమాలను చేయడం అక్కినేని అభిమానులను ఎంతగానో ఖుషీ చేస్తుంది. భవిష్యత్ లో అయన ఇంకా ఎన్ని సినిమాలు అనౌన్సు చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: