జక్కన్న రాజమౌళి ఏదైనా సినిమా మొదలెట్టారు అంటే కథ, కథనాలు, స్క్రిప్ట్ విషయమై ఆయన ఎంతో ఆలోచన చేసిగాని మూవీని పట్టాలెక్కించరు అనేది అందరికీ తెలిసిందే. అలానే ముందుగా తన సినిమాలకి సంబందించిన స్టోరీ పాయింట్ ని ప్రేక్షకాభిమానులకు వివరించే అలవాటు గల రాజమౌళి, దానిని తెరపై అందరినీ ఆకట్టుకునేలా ఎంతో అత్యద్భుతంగా తీసి మన్ననలు అందుకుంటూ ఉంటారు.

ఇక ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక్క అపజయం కూడా చవిచూడని రాజమౌళి సక్సెస్ కి అదే కారణం అని చెప్తుంటారు విశ్లేషకులు. ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ మూవీకి కీరవాణి సంగీతాన్ని అందించగా విజయేంద్ర ప్రసాద్ కథని, సాయి మాధవ్ బుర్రా మాటలని సమకూర్చారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీంపైగా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కూడా ఈ ఆర్ఆర్ ఆర్ మూవీ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుండడం విశేషం. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల పలుమార్లు వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ మూవీ అసలు ఎప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకాభిమానులు మనసులో మెదులుతున్న ప్రశ్న.

అయితే ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో థియేటర్స్ యొక్క ఆక్యుపెన్సీ ని పలు రాష్ట్రాలు 50 శాతం విధించాయి. అలానే ఈ స్థితిని చూస్తూనే కరోనా మహమ్మారి ఇప్పట్లో తగ్గే అవకాశం కనపడడం లేదని, అలానే కరోనా థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదనేది కొందరి మాట. మరి ఈ పరిస్థితులు పూర్తిగా చక్కబడి ఆర్ఆర్ఆర్ విడుదల అవడానికి మరొక ఆరు నెలలవరకు టైం పట్టవచ్చనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. నిజానికి ఈ పరిస్థితులు మార్చి తరువాత తగ్గుముఖం పట్టె ఛాన్స్ ఉందని కొందరు డాక్టర్లు చెప్తున్నారని, ఒకవేళ అదేకనుక జరిగితే మళ్ళి మెల్లగా అన్ని రంగాలు తెరుచుకుని పూర్తిగా పని చేయడానికి సిద్ధం అవుతాయని అంటున్నారు.

అయితే ఏప్రిల్ లో కనుక థియేటర్స్ పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో సిద్ధం అయితే ఆర్ఆర్ఆర్ కి మాత్రం అప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉండదని అంటున్నారు విశ్లేషకులు. దానికి కారణం ఆ సమయానికి సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట, పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్, వంటి సినిమాలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ఆల్రెడీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి ఉండడంతో ఆర్ఆర్ఆర్ కి మే తరువాతనే ఛాన్స్ ఉంటుందని, ఒకవేళ అదే జరిగితే రాజమౌళి పక్కాగా జూన్, లేదా జులై నెలాఖరులో పక్కాగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేద్దాం అనే ఆలోచన చేస్తున్నారట. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రచారం అవుతున్న కథనాలు మాత్రమే అని, పక్కాగా మొత్తంగా దీనిని బట్టి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అనౌన్స్ కావాలి అంటే ఈ కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రావాల్సిందే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: