మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఆ సినిమా తర్వాత గ్యాప్ లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. సైరా నరసింహరెడ్డి సినిమా కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందుగా 'ఆచార్య' సినిమా షూటింగ్ ను పూర్తీ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా తర్వాత ఇంకా మూడు చెస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు భోళాశంకర్ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.


సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే."భోళా శంకర్" టైటిల్ కు తగ్గట్లే సినిమా కథ కూడా ఉంటుందని తెలుస్తుంది..ఇప్పుడు"భోళా శంకర్" షూటింగ్‌లో చిరు బిజీగా ఉన్నారు.మెగా సినిమా ఫస్ట్‌లుక్‌ను మార్చి 1, 2022 ఉదయం 09:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసారు.ఈ  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి శంకర్ అనే పాత్రను పోషిస్తున్నారు అని లేటెస్ట్ టాక్.ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది.


మహానటి ఫెమ్ నటి కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తుంది, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్ గా కనిపించనుంది.  యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించారు., డుడ్లీ కెమెరా భాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. భోళా శంకర్ ఈ ఏడాది థియేటర్లలో విడుదల చేయనున్నారు..మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: