కోలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పేరుపొందాడు శివ కార్తికేయన్.. తాజాగా టాలీవుడ్ లో తన 20వ సినిమాకు సంబంధించి అడుగుపెట్టాలని చూస్తున్నారు శివ కార్తికేయన్. తెలుగులో మంచి టాలెంట్ కలిగిన డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు జాతిరత్నాలు వంటి సినిమాతో మంచి విజయాన్ని సాధించారు డైరెక్టర్ అనుదీప్. ఇక హీరో కూడా వరుణ్ డాక్టర్ వంటి సినిమాతో మంచి జోష్ మీద ఉన్నారు. అద్భుతమైన కథను సిద్ధం చేశారు శివ కార్తికేయన్ కోసం డైరెక్టర్ అనుదీప్. ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకి వెళ్ళింది..

తాజాగా మేకర్ సినిమాలోని హీరోయిన్ ని ప్రకటించడం జరిగింది. హీరోయిన్ గా ఉక్రేయిన్ బ్యూటీ మారియా ర్యాబోషప్కా ను ఎంపిక చేయడం జరిగింది. ఇదివరకే ఉక్రెయిన్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ భారతీయ ప్రసిద్ధి చెందిన వెబ్ సిరీస్ లో స్పెషల్ అప్స్ లో  నటించింది. ఈ క్రమంలో ఇప్పుడు శివకార్తికేయన్ కు జోడిగా ఈమె నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా ర్యాబోషప్కా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ఒక వినోదకరమైన రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళ భాషలలో కూడా తెరకెక్కించడం జరుగుతోంది. చిత్రం పాండిచెర్రి, యూకేలోని లండన్లో వంటి నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలను కూడా వెల్లడించినట్లు సమాచారం. ఏది ఏమైన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పేరు పొంది నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతూ హీరోగా పేరుపొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: