కోలీవుడ్ స్టార్ హీరో దక్షిణాదిన అతి పెద్ద హీ రో అయినా రజనీకాంత్ గత కొన్ని సినిమాలుగా తన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఎంతో నిరాశ పరుస్తున్నారు. దానికి కారణం ఆయన మంచి సినిమాలు చేయకపోవడ మే. రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో ఎంతో హుషారు నెలకొంటుంది. కబాలి సినిమా విడుదల సమయంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆ రోజు సెలవు దినం గా ప్రకటించడం రజనీకాంత్ కు ఉ న్న క్రేజ్ ను తెలియజేస్తుంది. అయితే సీనియర్ దర్శకుల కంటే యువ దర్శకులకు ఆయన ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం ఆ సినిమాలు ఫ్లాప్ గా రావ డం పట్ల కొంత మంది నిరాశ వ్యక్త పరుస్తున్నా రు.

రజినీకాంత్ ఎంపిక చేసుకునే జోనర్ సినిమాలను పూర్తిగా మార్చాలని వారు సూచిస్తున్నారు.  గత కొన్ని సినిమాలుగా ఆయన ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయడనే చెప్పాలి. కారణం ఏదైనా కూడా మంచి దర్శకులతో సినిమాలు చేస్తున్న కూడా ఎందుకో ఆ సినిమా లు ప్రేక్షకులకు కనెక్ట్ కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ హీరో చేయబోయే సినిమాలు తప్పకుండా ప్రేక్షకులను అలరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ యన గత సినిమా మురుగదాస్ దర్శకత్వంలో రాగా దర్బార్ చిత్రం కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది దాంతో రజినీకాంత్ స్టోరీ ఎంపిక పట్ల ఏ విధమైన లోపం వచ్చిందో అని కంగారు పడ్డారు.

అయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకంతో దర్శక నిర్మాతలు ఉన్నారు. ఇటీవల బీస్ట్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు నెల్సన్ రజనీకాంత్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రజనీకాంత్ కు ఏ స్థాయి విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: