హీరోయిన్లు ఆల్ రౌండర్స్ గా ఎదగడం ఎంతో కష్టమైన విషయం. ఎప్పుడో కానీ వారికి ఈ విధమైన అవకాశాలు రావు. కేవలం గ్లామర్ పంచడానికి హీరోలతో రొమాన్స్ చేయడానికి మాత్రమే వారు సినిమాలలో ఉంటారు అని ఇప్పటికీ విమర్శ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నుంచి వచ్చే సినిమాలలో హీరోయిన్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదని వారిని గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తారని ఆ సినిమాలే ఎక్కువగా వస్తాయని ఓ విమర్శ ఎప్పటినుంచో ఉంది.

ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ సినిమాలో హీరోయిన్ పాత్ర చేసిన తమన్నా కు ఎనలేని గుర్తింపు దక్కింది. ఆమె ఈ స్థాయిలో నటించగలదా అనేంతగా ఆ సినిమాలోని పాత్ర ఆమెకు పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఏదో కాదు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్3. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ హీరోయిన్ పాత్ర తో పాటు అబ్బాయిలా కూడా గెటప్ వేసి నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది. గతం లో హీరోలు లేడీ గెటప్ లు వేసి ప్రేక్షకులను అలరించిన సినిమాలు చాలానే ఉన్నాయి.

 కానీ హీరోయిన్లు అబ్బాయిలా గెటప్ లో కనిపించి అలరించిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ విధమైన సినిమాలు పెద్దగా రావడం లేదనే చెప్పాలి. కానీ ఈ సినిమాలో తమన్నా నటించిన నటన అందరిలో ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగించింది అని చెప్పవచ్చు. మిల్కీ బ్యూటీ లో ఈ రకమైన టాలెంట్ ఉందా అని అందరూ అవ్వాక్కు అవుతున్నారు. సినిమా రెండవ అర్ధ భాగం మొత్తం కూడా అబ్బాయి గెటప్ లో కనిపించి ఏమాత్రం డౌట్ రాకుండా నటించింది. చెప్పాలంటే ఇద్దరు హీరోలను కూడా ఆమె ఈ సినిమాలో డామినేట్ చేస్తూనే ఉంది అని చెప్పాలి. అలా ఆమె ఎఫ్ 3 సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోగానే ఆమె భవిష్యత్తులో ఎలాంటి పాత్రను అయినా చేయడానికి సిద్ధమేనని ఈ చిత్రం ద్వారా చెప్పినట్లు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: