
మొదటి రోజు ఈ సినిమాకు తమిళ నాడు ఏరియాలో 10.80 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 60 లక్షల కలెక్షన్లు దక్కాయి. కర్ణాటక ఏరియాలో 1.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , కేరళ లో 25 లక్షల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 2.5 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి మొదటి రోజు 7.65 కోట్ల షేర్ ... 15.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 44 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ 45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజే మంచి టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లు మాత్రం దక్కలేదు.