ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇది నిజంగానే ఒక వెరీ బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సాధారణంగా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో అయినా సినిమా చేయడం అంటే, ఆయన తీసుకునే పారితోషికం చాలా ముఖ్యమైపోతుంది. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమా చేయడానికి అంగీకరిస్తే, నిర్మాతలు కూడా ఆయన ఇచ్చే మార్కెట్ విలువ, బాక్సాఫీస్ రేంజ్, కలెక్షన్లపై ఆధారపడి బడ్జెట్‌ను ప్లాన్ చేస్తారు. అందుకే హీరో రెమ్యూనరేషన్  అనేది ఒక సినిమాలో అత్యంత కీలకమైన అంశం. అయితే మన డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఈ విషయంలో పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఏ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక సినిమా చేయాలని అనుకుంటే నిర్మాతలు క్యూలో నిలబడి, ముందుగానే వందల కోట్ల వరకు చెక్కులు కట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఒక్కో సినిమా కోసం ప్రభాస్ 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని ఇండస్ట్రీలో చాలా సార్లు హైలైట్ అయ్యింది.


కానీ ఇటీవల ప్రభాస్ తన డెసీషన్స్ లో పూర్తిగా కొత్తదనాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన స్పెషల్ అప్పియరెన్స్ రోల్స్ విషయంలో డబ్బు గురించి అసలు ఆలోచించట్లేదు. ఉదాహరణకు, "మీరాయి" సినిమాలో .. అలాగే "కన్నప్ప" సినిమాలో ఇచ్చిన స్పెషల్ అప్పియరెన్స్ – ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్  తీసుకోలేదని ఇండస్ట్రీ టాక్. ఇది ఆయన యొక్క మంచి మనసును, ఫ్రెండ్షిప్స్‌కి ఇచ్చే విలువను చూపిస్తుంది.



ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ మరో పెద్ద నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్అట్లీ కాంబినేషన్‌లో వచ్చే భారీ ప్రాజెక్ట్ కోసం, అట్లీ ప్రత్యేకంగా ప్రభాస్ కోసం ఒక స్పెషల్ రోల్ డిజైన్ చేశారని టాక్. ఆ పాత్రలో ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారని, ఆ విషయంలో డిస్కషన్స్ కంప్లీట్ అయ్యాయని ఫిలింనగర్ లో జోరుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే – ఈ సినిమాలో కూడా ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదట.



ఇది విని సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు నిజంగానే షాక్ అయ్యారు. ఎందుకంటే వారి హీరో ఎప్పుడూ పెద్ద సినిమాలు చేస్తే భారీగా డబ్బు తీసుకుంటారని అందరికీ తెలుసు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు వరుసగా ఇలా సినిమాలు చేస్తూ, డబ్బు తీసుకోకుండా ఫ్రెండ్షిప్ కోసం లేదా అప్యాయత కోసం ఓకే చెబుతున్నారని విని ఫ్యాన్స్ మిక్స్‌డ్ ఫీలింగ్స్‌లో ఉన్నారు. కొంతమంది ప్రభాస్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు – “ఎంత పెద్ద స్టార్ అయినా, తన స్నేహితుల కోసం, మంచి రిలేషన్‌షిప్స్ కోసం డబ్బు గురించి ఆలోచించకుండా ఇలా ఓకే చెప్పడం గొప్ప మనసు” అంటూ. మరోవైపు కొందరు అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు – “ఇలాగే చేస్తూ పోతే ప్రతి ఒక్కరు నిన్ను ఫ్రెండ్షిప్ పేరుతో వాడుకుంటారు, నువ్వు ఫ్యాన్స్ ఆశించే స్థాయి ప్రాజెక్ట్స్‌కే ఫోకస్ చేయాలి” అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.


మొత్తం మీద, ప్రభాస్ డబ్బు తీసుకోకుండా వరుసగా ఇలా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారని వినిపించడం ఫ్యాన్స్‌కి ఒకవైపు ప్రౌడ్ ఫీలింగ్ ఇచ్చినా, మరోవైపు నిజంగానే ఒక బిగ్ షాక్ ఇచ్చినట్టే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ ట్రెండ్ అవుతూ, ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: