
ఈ చర్యలు భారతీయ విద్యార్థులు, ఇతర విదేశీయులకు అడ్మిషన్ అవకాశాలను తగ్గిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ యూనివర్సిటీల్లో "ఆంటీ-అమెరికన్" వాల్యూస్‌ను అరికట్టాలని ఈ మెమో ద్వారా ప్రయత్నిస్తున్నారు.ఈ మెమో ప్రకారం, అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య 15 శాతానికి పరిమితం చేయాలి. ఒకే దేశం నుంచి 5 శాతం మించకూడదు. రేస్, సెక్స్ ఆధారంగా అడ్మిషన్లు, హైరింగ్‌లు నిషేధించాలి. SAT లేదా సిమిలర్ స్టాండర్డ్ టెస్ట్‌లు కట్టుబడి నిర్వహించాలి. ట్యూషన్ ఫీజ్‌లు 5 సంవత్సరాలు ఫ్రీజ్ చేయాలి, గ్రేడ్ ఇన్‌ఫ్లేషన్‌ను అరికట్టాలి.
ఈ మార్పులు భారతీయ విద్యార్థులకు హార్వర్డ్, MIT వంటి టాప్ యూనివర్సిటీల్లో సీట్లు తగ్గించే పరిణామానికి దారితీస్తాయి.భారత్ నుంచి గతేడాది 3 లక్షల మంది పైగా విద్యార్థులు అమెరికాలో చేరారు. ఈ మెమో వల్ల వీసా అప్రూవల్స్, అడ్మిషన్ ప్రాసెస్‌లు కష్టతరమవుతాయి. ట్రంప్ పాలసీలు DEI ప్రోగ్రామ్స్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ప్రో-పాలస్తీన్ ప్రొటెస్టులు, ట్రాన్స్‌జెండర్ పాలసీలు, క్లైమేట్ ఇనిషియేటివ్స్ మీద ఫండింగ్ కట్ బెదిరింపులు ఇప్పటికే ఉన్నాయి. భారతీయ విద్యార్థులు STEM కోర్సుల్లో ఎక్కువగా ఉంటారు. ఈ పరిమితులు వారి కెరీర్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు