ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కస్తూరి ఇక ఇప్పుడు మాత్రం సీరియల్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పాలి. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సీరియల్ ప్రతి తెలుగు ఇంటికి కూడా దగ్గర అయిపోయింది అనే చెప్పాలి. అయితే నటనతో ప్రశంసలు అందుకునే కస్తూరి అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.


 వెండితెరపై అదృష్టం కలిసి రాకపోవడంతో బుల్లితెరపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. అయితే గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు క్రికెటర్ కె.ఎల్.రాహుల్ గురించి కూడా తన ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేసింది కస్తూరి. ఈ మాజీ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అని చెప్పాలి. ఇటీవలే కేఎల్ రాహుల్ ఒక అండర్వేర్ వాణిజ్య ప్రకటనలో కనిపించాడు. ఈ క్రమంలో ఇదే విషయంపై స్పందించిన కస్తూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


 క్రికెటర్లు మామూలుగా కోలాలు, చిప్స్, ఆన్లైన్ గేమ్స్ ఇతర ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం చేయడమే చూస్తూ ఉంటాము. కానీ ఎంతో మంది క్రికెటర్లు లోదుస్తుల ప్రచారం చేయడానికి సిగ్గు పడుతూ ఉంటారు.  కానీ రాహుల్ మాత్రం ఎలాంటి భయం బెరుకు లేకుండా లోదుస్తుల కు ప్రచారం చేయడానికి సిద్ధమై పోయాడు. కేఎల్ రాహుల్ ను ఈ బాక్సr లో చూడటం ఎంతో బాగుంది. ఇది పురుషుల దుస్తుల కు సంబంధించి వారి ఆలోచనల నుంచి బయటకు తీసుకు వస్తూ ఉంటుంది అని నమ్ముతున్నాను అంటూ కస్తూరి తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: