క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి పరిచయమే అవసరం లేదు. దాదాపుగా 30 సంవత్సరాలుగా క్రికెట్ లో ఉంటూ ఎన్నో అసామాన్య రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. ముఖ్యంగా మాస్టర్ బ్లాస్టర్ అంటూ పేరుకు ముందు గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇతనికి ఇద్దరు వారసులు ఉన్నారు... ఒకరు తండ్రి లాగే క్రికెట్ ను తన కెరీర్ గా ఎంచుకున్నాడు. అయితే సచిన్ బ్యాట్స్మన్ అయితే... కొడుకు అర్జున్ మాత్రం బౌలర్ గా ఎదగడానికి ఇంకా కృషి చేస్తున్నాడు. ఇక తన కూతురు సారా టెండూల్కర్ మాత్రం మోడలింగ్ ను తన రంగంగా ఎంచుకుంది. ఈమె లండన్ లో మెడిసిన్ పూర్తి చేసినా... యాక్టింగ్ లోనూ శిక్షణ తీసుకుంటోంది. సారా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు మరియు వీడియో లను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఈమెకు  లక్షల కొద్దీ ఫాలోయర్స్ కూడా ఉన్నారు. అలా నటన స్టార్ట్ చేయక ముందే సోషల్ మీడియా ద్వారా లక్షల మందికి చేరువైంది. అతి త్వరలోనే హీరోయిన్ గా తన సినిమా కెరీర్ ను స్టార్ట్ చేయనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే...తెలుస్తున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సినిమా ద్వారా సారా హీరోయిన్ గా పరిచయం అవుతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. స్టార్ హీరో జునియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో ఒక మూవీ రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం కొరటాల ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ లు అందరినీ కలిశాడు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అందుకే ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో ఉన్న పరిచయంతో సచిన్ కూతురు సారా ను ఇందులో నటింపచేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం చర్చల దశలోనే ఉంది. ఇంకా కన్ఫర్మ్ అయినట్లు సూచనలు లేవు. మరి ఇది కనుక నిజం అయితే... టాలీవుడ్ కి ఎన్టీఆర్ ద్వారా సారా టెండూల్కర్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. పైగా సచిన్ కూతురి సినిమా కనుక ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే ఇవన్నీ జరుగుతాయా లేదా అన్నది తెలియాలంటే చిత్ర బృందం నుండి కానీ లేదా సారా నుండి కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: