అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హెబ్బా పటేల్ , రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా ఈ మూవీ ద్వారా ఎంతో మంది కుర్రకారు మనసును దోచుకుంది. 

ఆ తర్వాత అనేక మూవీలలో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వచ్చినప్పటికీ  కుమారి 21 ఎఫ్ మూవీ రేంజ్ విజయం మాత్రం హెబ్బా పటేల్ కు బాక్సా ఫీస్ దగ్గర దక్కలేదు.  కొంత కాలం క్రితమే హెబ్బాపటేల్ , రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన రెడ్ మూవీ లో ఐటెం సాంగ్ లో నటించింది. ఈ ఐటమ్ సాంగ్ లో హెబ్బా పటేల్ తన డాన్స్ తో , అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో టచ్ లో ఉంటూ వారితో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 

అలాగే హెబ్బా పటేల్ తన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా హెబ్బా పటేల్ తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో హెబ్బా పటేల్ బ్లూ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని , స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ పిక్స్ కి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు లూకింగ్ బ్యూటిఫుల్ , లవ్ , ఫైర్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: