టాలీవుడ్ స్టార్ హీరో చియన్ విక్రమ్ సౌత్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నారు. పేరుకు మాత్రమే ఆయన తమిళ హీరో కాని తెలుగు ఇంకా కన్నడ లో కూడా విక్రమ్ కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.ఆయన సినిమాలకు తెలుగులో కూడా క్రేజ్ బాగా ఉంటుంది.హీరో విక్రమ్ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తారు అందుకే బాషాబేధం లేకుండా ఆయన సినిమాలకోసం ఎగబడతారు సినీ జనాలు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. తెలుగు హీరోలకు సమానంగా ఇక్కడ క్రేజ్ సంపాదించుకున్న నటుడు చియాన్ విక్రమ్‌. సినిమా సినిమాకు కూడా వేరియేషన్‌ను చూపిస్తూ మంచి విలక్షణ నటుడుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ప్రస్తుతం చియాన్ విక్రమ్ నటించిన కొత్త సినిమా కోబ్రా. ఈ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విక్రమ్ చాలా డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా చాలా కాలం క్రితం షూటింగ్ ని పూర్తిచేసుకుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అయిన కారణంగా ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతూ వస్తోంది. ఇక ఈ మూవీని ఈ నెల అంటే.. అగస్ట్ 31వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు టీమ్.ఇంకా ఈ క్రమంలోనే భారీ ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నారు కోబ్రా మేకర్స్. అంతే కాదు అందులో భాగంగా ముందుగా వరుస అప్‌ డేట్‌లను కూడా రిలీజ్ చేస్తున్నారు.


ఇక తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్‌డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. విక్రమ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కోబ్రా సినిమా ట్రైలర్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఆగస్టు 25 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ లో హీరో విక్రమ్ ప్రకటించారు. ఇక విక్రమ్ కోబ్రా సినిమాలో మొత్తం ఏడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. మెయిన్ గా విక్రమ్ సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తారని సమాచారం తెలుస్తుంది.ఇప్పటి వరకూ కూడా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతీ అప్ డేట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్లు ఇంకా పాటలు కోబ్రాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి.ఇంకా ఈ మూవీలో విక్రమ్‌కు జోడీగా కెజియఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.అలాగే మరో విశేషం ఏంటీ అంటే..ఈమూవీలో విలన్ గా స్టార్ క్రికెటర్ ఇర్పాన్ ఖాన్ కూడా నటించారు. ఇక సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ పతాకంపై ఎస్‌.ఎస్‌. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సినిమాను నిర్మించాడు. ఏఆర్‌. రెహమాన్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: