టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ హీరో ఆఖరుగా నటించిన ఆరు సినిమాలు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాల గురించి తెలుసుకుందాం.  

విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ నిన్న అనగా ఆగస్ట్ 25 వ తేదీన విడుదల అయ్యింది. ఈ మూవీ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా , అనన్య పాండేమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.57 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.40  కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 7.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

విజయ్ దేవరకొండ హీరోగా ప్రియాంక జవాన్కర్ హీరోయిన్ గా తెరకెక్కిన టాక్సీవాలా మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.30 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన నోట మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: