తెలుగు బుల్లితెరపై ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కార్యక్రమం ఒక సెన్సేషన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అప్పటివరకూ బుల్లితెరపై  ఎన్నో కార్యక్రమాలు వచ్చాయి పోయాయి.  ఇక అన్ని కార్యక్రమాలు లాగానే ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైంది జబర్దస్త్. కానీ సినిమాల్లో దొరకని సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించి తెలుగు ప్రేక్షకుల చూపును ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ఈ క్రమంలోనే టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ బుల్లితెర చరిత్రలోనే సరికొత్త సెన్సేషన్ సృష్టించింది.


 ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీ లోకి రావాలి అనుకునే ఎంతోమంది కమెడియన్స్ కి జబర్దస్త్ ఒక మంచి వేదికగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా జబర్దస్త్ ద్వారా ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్స్ గుర్తింపు సంపాదించుకొని సినిమాల్లో రాణిస్తున్నారు. ఇలా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. సాదాసీదా కమెడియన్ స్థాయినుంచి టీం లీడర్ గా కూడా ఎదిగాడు అవినాష్.


 ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ద్వారా తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు అని చెప్పాలి. కానీ బిగ్ బాస్ లోకి వెళ్లడం కారణంగా జబర్దస్త్ దూరమయ్యాడు. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో కనిపిస్తున్నాడు  అవినాష్. ఇకపోతే ఇటీవల అవినాష్ తండ్రి కాబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ విషయంపై క్లారిటీ  ఇచ్చాడు ముక్కు అవినాష్. అయితే తాను తండ్రి కాబోతున్నా అన్న వార్తల్లో నిజం లేదని ఇటీవలే నువ్వు విశ్రాంతి తీసుకో అసలే గర్భవతివి అంటూ చెప్పిన వీడియో కేవలం కామెడీ కోసం మాత్రమే చేసింది అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్లిన తమ ఇదే ప్రశ్న అడుగుతున్నారు అని అవినాష్  చెప్పుకొచ్చాడు. ఇలాంటి శుభవార్త ఉంటే ముందుగా అభిమానులకు చెబుతాను అంటూ అవినాశ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: