తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సత్యదేవ్ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన జ్యోతిలక్ష్మి మూవీ లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సత్యదేవ్ ఎన్నో విలక్షణమైన మూవీ లలో ఎన్నో విలక్షమున మైన పాత్ర లలో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ నటుడి గా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికే సత్యదేవ్ ,  మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ లో ఒక చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆచార్య మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. 

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సత్యదేవ్  'గాడ్సే' అనే మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన గాడ్సే మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా సత్యదేవ్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఈ సినిమాలోని సత్యదేవ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని తాజాగా విడుదల చేసింది. గాడ్ ఫాదర్ మూవీ లోని సత్యదేవ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: