మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ముకుంద మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన వరుణ్ తేజ్ మొదటి మూవీ తోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ తరువాత ఎన్నో మూవీ లలో నటించిన వరుణ్ తేజ్ ఇప్పటికే ఎన్నో విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వరుణ్ తేజ్ ఈ సంవత్సరం గని మరియు ఎఫ్3 మూవీ లలో హీరోగా నటించాడు. ఈ మూవీ లలో గని మూవీ లో వరుణ్ తేజ్ సోలో హీరో గా నటించగా ,  ఎఫ్ 3 మూవీ లో విక్టరీ వెంకటేష్ తో కలిసి హీరో గా నటించాడు. గని మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఎఫ్ 3 మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా వరుణ్ తేజ్ తన 13 వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశాడు.

వరుణ్ తేజ్ తన 13 వ మూవీ ని శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ ని నెక్స్ట్ సినిమా తీయనున్నట్లు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అధికారికంగా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేస్తూ ఆవాదులు లేని ధైర్య సాహసాలు , శౌర్యాన్ని చూపే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ,  ఆకాశంలో జరిగే యుద్ధాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ పోస్ట్ పెట్టాడు. ఇలా వరుణ్ తేజ్ తన 13 వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా విడుదల చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: