టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ,  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తో మంచి క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత స్వామి రారా ,  కార్తికేయ ,  ఎక్కడికి పోతావు చిన్నవాడా ,  వంటి విజయ వంతమైన మూవీ లతో నిఖిల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా నిఖిల్ తనకు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని తీసుకువచ్చిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తరికెక్కిన కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి చందు మండేటి దర్శకత్వం వహించగా ,  అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్షమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సాధించి ,  అదే రేంజ్ లో కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. ఈ మూవీ కి తెలుగు తో పాటు హిందీ నుండి కూడా అద్భుతమైన కలెక్షన్ లు దక్కాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ 'కార్తికేయ 3' మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో నిఖిల్ మాట్లాడుతూ ...  తారాగణం మరియు సాంకేతిక అంశాల పరంగా ఫ్రాంచైజీని పెద్దదిగా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నిఖిల్ వెల్లడించాడు. అలాగే కార్తికేయ 3 మూవీ ని త్రీడీ లో విడుదల చేయనున్నట్లు నిఖిల్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: