సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక ఈ కుటుంబం నుంచి ఎంతోమంది నటులుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కేవలం కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇక అంతే కాకుండా కొంతమంది రాజకీయాలలో సినీ ఇండస్ట్రీలో కూడా మంచిపట్టు సాధిస్తూ ఉన్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో ఎదిగినప్పటికీ కొన్ని సందర్భాలలో మాత్రం అనిగి మనగి ఉండేవారట. అలాంటి గొప్ప అలవాట్లు ఉండడం వల్లే ఆయన ఆ స్థాయికి చేరారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న ఆచితూచి అందరితో చర్చించి మరి నిర్ణయాన్ని తీసుకునే వారట.


ఎన్టీఆర్ నట వారసత్వ విషయానికి వస్తే హరికృష్ణ బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎవరి పరిధిలో వారు సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ బాలకృష్ణ సినిమాలో రాజకీయాలలో బాగా రాణిస్తున్నారు. అయితే హరికృష్ణ సైతం కాస్త వయసు ఎక్కువగా కావడంతో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సినిమాలతోని తన కెరీర్ ముగించాలని చెప్పవచ్చు. అప్పటికే సీతయ్య సినిమా ఎన్నిసార్లు బుల్లితెరపై ప్రసారమైన. ఎన్టీఆర్ కి హరికృష్ణ అంటే చాలా ఇష్టమట. అందుచేతనే తన తండ్రి ఎన్టీఆర్ వెనకాలే ఉంటూ ఆయన చెప్పినవన్నీ చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేవారు.


దాంతో హరికృష్ణ ఎలాంటివి అడిగినా కూడా తన తండ్రి కాదనకుండా ఉండేవారట. అలా ఉన్న వీరిద్దరూ ఒక రెండేళ్లపాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదని వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి అందుకు గల కారణం ఏమిటంటే..ఒక సినిమా హాల్ అన్నట్లుగా సమాచారం. హరికృష్ణ పేరు పైన ఒక సినిమా థియేటర్ కట్టాలని తన తండ్రిని అడగగా అందుకు ఆయన అక్కినేని వారి సలహాను అడిగారు దాని స్థానంలో ఒక స్టూడియో కడితే మేరు మంచి లాభాలు వస్తాయని నాగేశ్వరరావు సూచించారు. దీంతో ఎన్టీఆర్ సినిమా హాలు కట్టాలని నిర్ణయాన్ని విరమించుకున్నారట దీంతో ఈ విషయంపై హరికృష్ణ రెండు సంవత్సరాలు పాటు మాట్లాడలేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: