అక్కినేని అభిమానులను ఇటీవలే విడుదలైన నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ తీవ్రంగా నిరాశపరిచిన సంగతి మన అందరికి తెలిసిందే మరి ..దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయం సాధించిన సినిమాగా నిలిచింది..విడుదలకు ముందు టీజర్ మరియు ట్రైలర్ తో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో  బారి అంచనాలను పుట్టించడం తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరిగింది..కానీ ఈ చిత్రం వసూళ్లు ఫుల్ రన్ లో కనీసం 5 కోట్ల రూపాయిలు కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు అంటా మరి, దీనితో అక్కినేని అభిమానులు బాగా నిరాశకి గురైయ్యారు..ఈ వయస్సులో కూడా ప్రయోగాత్మక సినిమాలు తియ్యడం ఎందుకు..కమర్షియల్ సినిమాలు చేసి మమల్ని ఆనందింపచెయ్యొచ్చు కదా, ఈ టార్చర్ ఏంటి మాకు అంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియా లో తెగ బాధపడుతూ ఉన్నారు..అలాంటి అభిమానులకు ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త శుభవార్త అనే చెప్పాలి.
 

అదేమిటి అంటే మెగాస్టార్ చిరంజీవి కి లేటెస్ట్ గా గాడ్ ఫాదర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన డైరెక్టర్ మోహన్ రాజా అక్కినేని నాగార్జున మరియు ఆయన తనయుడు అఖిల్ ని పెట్టి ఒక మల్టీస్టార్ర్ర్ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు నాగార్జున గారు ..ఇటీవలే నాగార్జున గారిని కలిసి ఈ కథ వినిపించగా 'ఇలాంటి కథ కోసమే కదా అయ్యా..ఇంతకాలం నేను ఎదురు చూసింది' అంటూ మోహన్ రాజా ని కౌగలించుకొని, నువ్వు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి నేను రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట..మోహన్ రాజా దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో మనం గాడ్ ఫాదర్ సినిమాలో చూసాము.


పేరుకి అది మలయాళం లూసిఫెర్ సినిమాకి రీమేక్ అయ్యినప్పటికీ కూడా తెలుగు కి తగట్టు మార్పులు చేర్పులు చేశారు , అసలు రీమేక్ సినిమాని చూస్తున్న అనుభూతిని ఆడియన్స్ కి మాత్రం కలగనివ్వకుండా ఒక కొత్త సినిమాని చూస్తున్నట్టే తెరకెక్కించాడు..అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి ని అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకున్నారో అలాగే చూపించాడు మోహన్ రాజా..కచ్చితంగా అక్కినేని అభిమానులకు కూడా అలాంటి క్రేజీ ట్రీట్ ఇస్తాడని అభిమానులు భావిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి అని చిత్రం యూనిట్ పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: