శివ కార్తికేయన్ తెలుగులో డైరెక్ట్ గా చేసిన తొలి సినిమా ప్రిన్స్. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. జాతి రత్నాలు సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు అనుదీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండగా ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కాబోతూ ఉండడం విశేషం. ఆహ్లాదకరమైన కామెడీని పండించడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న అనుదీప్ ఈ సినిమాను కూడా ఆ విధంగానే చేశాడని ఆయన ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్ ను బట్టి తెలుస్తుంది.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆ విధంగా ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించారు. శివ కార్తికేయన్ తొలిసారిగా తెలుగులో చేస్తున్న సినిమా విజయం సాధిస్తే ఆయనకు తిరుగుండదని చెప్పాలి. 

మరి ఇప్పటిదాకా చేసిన ప్రమోషన్ కార్యక్రమాలలో సినిమా పట్ల ఎంతో నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ మాట్లాడుతూ వస్తున్నాడు హీరో శివ కార్తికేయన్. అనుదీప్ పై పూర్తి నమ్మకం ఉన్నట్లుగా మంచి సెన్సిటివ్ కథను తెరపైన బాగా చూపించాడు అనే విధంగా ఈ సినిమాను చేశాడు అని శివ కార్తికేయ దర్శకుడుని పొగడడం ఆయనలో ఈ సినిమా పట్ల ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా తర్వాత కూడా తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయడానికి శివ కార్తికేయన్ నిర్ణయించుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. తొందరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. రేపే విడుదల కాబోతున్న ఈ ప్రిన్స్ భారీ విజయాన్ని అందుకుంటే తప్పకుండా ఆయన నుంచి తెలుగు సినిమాలు రావడం ఖాయం అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: