ప్రముఖ మీడియా సంస్థలలో ఒకటి అయినటువంటి ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మీడియా సంస్థ ఎప్పటి కప్పుడు సినీ తారలపై సర్వేలను నిర్వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ మీడియా సంస్థ తాజాగా కూడా హీరోయిన్ లపై ఒక సర్వే ను నిర్వహించింది. తాజాగా ఈ మీడియా సంస్థ దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నటీ మణులపై సర్వే ను నిర్వహించింది.  ఈ సర్వే లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లుగా కొనసాగుతున్న ముద్దు గుమ్మ లు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో భారత దేశం లోనే అత్యంత ప్రజాదారణ పొందిన నటీమణులలో మొదటి స్థానంలో సమంత నిలిచింది. 

ఆ తర్వాత 2 వ స్థానంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నిలవగా , 3 వ స్థానంలో లేడీ సూపర్ స్టార్ నయన తార నిలిచింది.  ఆ తర్వాత 4 వ స్థానంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి కాజల్ అగర్వాల్ నిలిచింది. ఆ తర్వాత 5 వ స్థానంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నిలిచింది. 6 వ స్థానంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన నిలిచింది. 7 వ స్థానంలో కత్రినా కైఫ్ నిలిచింది.   8 వ స్థానంలో కీర్తి సురేష్ నిలవగా ,  9 వ స్థానంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న అనుష్క శెట్టి నిలిచింది. 10 వ స్థానంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: