సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే నిలదొక్కుని అవకాశాలు దక్కించుకోవడం అంటే అది అంత సులభమైన విషయం కాదు. ఇలా ఇండస్ట్రీలో రాణించాలి అనుకుని ఎంతోమంది కనుమరుగైన వారు ఉన్నారు. అదే సమయంలో ఇక ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో ప్రియదర్శి కూడా ఒకరు అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు ప్రియదర్శి.


 ఇతని గురించి ఇతని కామెడీ టైమింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. టెర్రర్ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక ఇదే సినిమాతో విజయ్ దేవరకొండ కూడా హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఇక ఈ సినిమాతో ప్రియదర్శి ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక తర్వాత ఏకంగా స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాలను కూడా దక్కించుకున్నాడు అని చెప్పాలి.  ఏ హీరో సినిమా అయినా సరే ప్రియదర్శి మాత్రం తప్పక కనిపిస్తూ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉన్నాడు.


 ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియదర్శి తన కెరియర్ గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. 2014లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన టెర్రర్ సినిమాలో పాత్ర కోసం ఆడిషన్స్ చేస్తున్నారంటే తెలిసి అక్కడికి వెళ్లాను. మొదట నన్ను పాత్ర కోసం సెలెక్ట్ చేయలేదు. కానీ ఆ తర్వాత మాత్రం పాత్రకు సరిగ్గా సరిపోతాను అని తెలిసి ఇక మళ్ళీ నన్ను పిలిచారు అంటూ చెప్పుకొచ్చాడు. జీవితంలో విమర్శలు ఎదుర్కోలేదా అంటూ ప్రశ్నించగా చాలాసార్లు ఎదుర్కొన్నాను.. ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు నల్లగా సన్నగా ఉన్నాడు. మొటిమలు ఎక్కువగా ఉన్నాయి. హీరో కంటే పొడుగ్గా ఉన్నాడు అంటూ హేళన చేస్తూ మాట్లాడేవారు. ఇలా ఎవరైనా నన్ను విమర్శలు చేస్తే నన్ను నేను ప్రోత్సహించుకుని సర్దు చెప్పుకునే వాడిని అంటూ ప్రియదర్శి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: