ఒక్కప్పుడు బుల్లితెర స్టార్స్, షార్ట్ ఫిలిమ్స్ లో మెరిసి ఇప్పుడు యూట్యూబ్‌ని దున్నేస్తున్న  ఈ నటీనటులు ఎందరో ఉన్నారు ఆని చెప్పొచ్చు, వారిలో టాప్‌లో నిలుస్తున్న భామలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంకర్ లాస్య గురించి మనకి బాగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అమే పేరు. ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసి అలరించింది. అయితే పెళ్లయిన తర్వాత యాంకర్‌గా చేయడం మానేసింది. కానీ యూట్యూబ్‌లో మాత్రం బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఈ క్యూట్ యాంకర్ ఛానల్ 'లాస్య టాక్స్'కి 1.26 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ స్టార్‌ ఫుడ్, ట్రావెల్, మేకప్, బేబీ కేర్ టిప్స్, హెల్త్ టిప్స్ పై ఈ ముద్దుగుమ్మ ఇలా బోలెడుఅన్ని వీడియోలు చేస్తుంటుంది.


డైలీ లైఫ్ సిట్యుయేషన్లను ఫన్నీగా చూపించడంలో జాహ్నవి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. బొద్దుగా ఉంటూ ముద్దుగా మాట్లాడే ఈ తార కళ్యాణ వైభోగమే వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించింది ఈ బ్యూటీ. షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేసింది. అయితే సిల్వర్ స్క్రీన్‌ ద్వారా అంతగా గుర్తింపు తెచ్చుకొని ఈ నటి యూట్యూబ్‌లో మాత్రం మస్తు పాపులర్ అయింది మరీ

గట్టి గట్టిగా అరిస్తూ అమాయకంగా మాట్లాడుతూ ఫుల్ ఎనర్జీ తో బెస్ట్ టీవీ యాంకర్‌గా నిలిచింది  నటి శ్రీముఖి. సినిమాల్లో కూడా ఈ తార  ఒక మెరుపు మెరిసింది. కాగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సినిమాలకు టీవీ షోలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ద్వారా టచ్‌లో ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ భామకు 7 లక్షల 49 వేల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రేమకేతన యూట్యూబ్ ఛానల్ వేదికగా ట్రావెల్ బ్లాక్స్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇతర పర్సనల్ వీడియోలు పెట్టుకుంటుంది.

అలానే హిమజ బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ బాగా పాపులర్ అయింది. ఈ ముద్దుగుమ్మ కూడా  ఈ మధ్యే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. ఈ బబ్లీ గర్ల్‌కి ఐదు లక్షలకు పైగానే యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక యాంకర్ సుమ రెండు ఛానెల్స్ మెయింటైన్ చేస్తుండగా ఆ రెండిటికీ 5 లక్షల పైగానే సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ జాబితాలో శివ జ్యోతి, రోహిణి వంటి యాక్ట్రెసెస్ కూడా ఉన్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: