యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా దేశ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించినుండగా ,  రత్నవేలు ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూ వీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ , ఎన్టీఆర్ 30 వ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది.

కార్పొరేట్ వైద్యం ,  అందులోని సవాళ్లు , పేదలకు ఇబ్బందులు తదితర అంశాలపై లోతుగా ఈ మూవీ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ అయిన తర్వాతే ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే మూవీ కావడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: