అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ ‘ఊర్వశివో రాక్షసివో’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనికితోడు విమర్శకులు కూడ తమ రివ్యూలలో మంచి మార్కులు ఇవ్వడంతో ఈమూవీ శిరీష్ కెరియర్ లో మొట్టమొదటి హిట్ గా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈమూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో ఈసినిమాకు కలక్షన్స్ అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ పాజిటివ్ టాక్ ఈమూవీని హిట్ రేంజ్ కి తీసుకు వెళుతుందా లేదా అన్నవిషయం ఈ వీకెండ్ పూర్తి అయితే కాని తెలియదు అని అంటున్నారు.


‘ఊర్వశివో ప్రేయసివో’ మూవీలో రొమాంటిక్ యాంగిల్ చాల ఎక్కువగా ఉండటంతో ఒకప్పటి ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. లిప్ టు లిప్ ముద్దు సీన్లు సెక్స్ ని ప్రేరేపించే ఇంటిమసీ సన్నివేశాలు పెడుతూ మధ్యలో కామెడీ సీన్స్ విపరీతంగా దర్శకుడు రాకేష్ శశి నడిపించడంతో ఈమూవీని చూస్తున్న వారికి ఇది ఒక డిఫరెంట్ మూవీ అని అనిపిస్తున్నట్లు టాక్.


మోతాదు పెంచకుండా హాట్ సీన్స్ పెడుతూ కథను వెరైటీగా నడిపించడంతో ఈమూవీకి ప్రశంసలు వస్తున్నాయి. ఈ స్థాయిలో హాట్ కంటెంట్ ఉన్న సినిమాలు ఈమధ్య కాలంలో రాలేదు. ఈసినిమాలో శిరీష్ కాకుండా మరో మీడియం రేంజ్ హీరో ఈమూవీని చేసి ఉంటే ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అయి ఉండేది అన్న కామెంట్స్ వస్తున్నాయి.


అయితే గతంలో ఇలాంటి సినిమాలు చాల వచ్చి హిట్ అయ్యాయి. ఉదయ్ కిరణ్ రీమా సేన్ లు నటించిన చిత్రంలో ఈ టీనేజ్ కెమిస్ట్రీని తేజ చూపించి చాల పెద్ద హిట్టు కొట్టాడు. అదేవిధంగా ‘7జి బృందావన్ కాలనీలో’ రవికృష్ణ సోనియా అగర్వాల్ ల రొమాన్స్ ని సెల్వ రాఘవన్ చిత్రీకరించిన విధానంతో అప్పట్లో ఆమూవీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇంచుమించు మళ్ళీ ఆ పాత సినిమాలను గుర్తు చేసే విధంగా ఈమూవీ ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: