జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న పొడుగు సుందరి ఫరియా అబ్దుల్లా. మంచి అభినయం కనపరిచే హీరోయిన్ లకు డిమాండ్ భారీ గా ఉన్న నేపథ్యంలో ఈమెకు డిమాండ్ భారీగా ఏర్పడింది. అలా ఇప్పుడు రెండవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆమె వచ్చిందని చెప్పాలి. వాస్తవానికి ఈమెకు తొలి సినిమాతో వచ్చిన క్రేజ్ వల్ల మరిన్ని సినిమాలు చేయాల్సింది కానీ తన పాత్ర విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే చేసుకుంటూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఆ విధంగా తాజాగా సంతోష్ శోభన్ హీరోగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రం ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంతో వెరైటీగా ఉండడం అలాగే ఆమె అంద చందాలు యూత్ కి కనెక్ట్ అవడం వల్ల భారీ విజయాన్ని అందుకోగలిగింది. ఆ విధంగా ఆ తర్వాత వెంటనే వరుస సినిమాలను ఒప్పుకోకుండా నాగార్జునతో కలిసి ఒక స్పెషల్ సాంగులో చేసి ప్రేక్షకులను అలరించింది. ఆ విధంగా తన ఇమేజ్ను రెట్టింపు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమాలో నటించడం విశేషం నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా దానికి వారి నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తర్వాత ఆమె మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయం అని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. తొలి సినిమా కంటే రెండవ సినిమాలో నటన లో మంచి పరిణితి కనబరిచింది అని వారు చెబుతున్నారు. కొంతమంది యువ హీరోలు ఈ ముద్దుగుమ్మను తమ సినిమాలో ఎంపిక చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నటిగా కూడా మంచి మార్కులు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఉంటే తప్పకుండా సినిమాకు ప్లస్ అవుతుంది అని ఆలోచన చేస్తున్నారట. తెలుగు సినిమా పరిశ్రమకు మరోసారి పల్లవిగా ఈమె నిలుస్తుంది అని మరి కొంతమంది చెబుతున్నారు. గ్లామర్ పాత్రలు ఎక్కువగా చేయని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతానికైతే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటుంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: