మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కాంబోలో చాలా సంవత్సరాల తరువాత 3 వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ లు ఈమధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. కానీ మహేష్ తల్లి గారు ఇందిరా దేవి గారు చనిపోవడంతో మహేష్ ఈ సినిమా షూటింగ్ కి విరామం తీసుకొని ఆ పనులు చూసుకొని ఆ తరువాత రిలీఫ్ కోసం భారీ ట్రిప్ కి విదేశాలకు వెళ్ళాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీలుక్ పోస్టర్ లేదా టైటిల్ పోస్టర్‌ను మూవీ యూనిట్ రివీల్ చేసేందుకు రెడీ అవుతోందట.ఇదిలా ఉండగా మహేష్ ట్రిప్ ముగించుకొని తిరిగి వచ్చాకా మహేష్  ని కలవడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా సూర్య దేవర నాగవంశీ వెళ్లారట.


ఇక మహేష్ తో మాట్లాడి షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ని ఈ నెల 15 న కానీ 22 వ తేదీన కానీ మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఇక సెకండ్ షెడ్యూల్ ని నాన్ స్టాప్ గా ఆగకుండా 40 రోజులు షూటింగ్ జరపాలని టీం డిసైడ్ అయ్యారట. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన మరోసారి పూజా హెగ్డే నటిస్తుండగా ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని సమ్మర్ లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీ ఇంకా వాయిదా పడే ఛాన్స్ ఉందని సమాచారం తెలుస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో. ఇక ఈ సినిమా తరువాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో తన 29 వ సినిమా చేయనున్నాడు.ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ వరల్డ్ సినిమా. ఈ రెండు సినిమాల పై అభిమానులు ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక చూడాలి ఈ రెండు సినిమాలు ఎంత పెద్ద విజయం సాధిస్తాయో..

మరింత సమాచారం తెలుసుకోండి: