కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి యాష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న యాష్ కొంత కాలం క్రితం విడుదలైన కే జి ఎఫ్ చాప్టర్ 1 మరియు కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ లతో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కే జీ ఎఫ్ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా , శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా కే జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ కూడా ఉండబోతుంది అనే వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

తాజాగా కే జి ఎఫ్ మూవీ లో హీరోగా నటించిన యాష్ కే జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. యాష్ తాజాగా కే జి ఎఫ్ చాప్టర్ 3  ఫై స్పందిస్తూ ... కే జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ వస్తుంది అని తాను భావించడం లేదు అని యాష్ తాజాగా చెప్పు కొచ్చాడు. అలాగే కే జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ పై వస్తున్న వార్తల్లో నిజం లేదు అని ఈ హీరో పేర్కొన్నాడు.

ఇది ఇలా ఉంటే కే జీ ఎఫ్ చాప్టర్ 1 మరియు కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ లతో అద్భుతమైన క్రేజ్ ను దేశ వ్యాప్తంగా సంపాదించుకున్న యాష్ "కే జీ ఎఫ్ చాప్టర్ 2" మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్నప్పటికీ తన తదుపరి ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనలు మాత్రం ఈ హీరో ఇప్పటివరకు ప్రకటించ లేదు. మరి కే జి ఎఫ్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ యువ హీరో తన తదుపరి మూవీ ని ఏ దర్శకుడుతో చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: