నట శేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ రోజున ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్నుమూశారు. సినీ ప్రేక్షకులు, అభిమానులు, సినీ ప్రముఖుల సైతం ఉదయం లేవగానే కృష్ణ గారు లేరని వార్తతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తెలుగుజాతికి వారి మరణం తీరని లోటు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణ గారికి గుండెపోటు రావడంతో ఆదివారం రోజున తెల్లవారుజామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో కోడలు నమ్రత అడ్మిట్ చేయడం జరిగిందట.


8 మంది ప్రత్యేకమైన డాక్టర్లు బృందం కృష్ణకు చికిత్స అందించిన కిడ్నీతో పాటు పలు అవయవాలు కూడా పనిచేయకపోవడంతో చివరికి పోరాడి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది అంటూ ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా షాక్కు గురయ్యారు. ఇక కృష్ణ స్వస్థలమైన బుర్రె పాలెం లో కూడా పలు విషాదఛాయలు అందుకున్నాయి. తమ అభిమాన నటుడు మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయామంటూ అభిమానులతో పాటు బుర్రపాలెం ప్రజలు కూడా కన్నీరు మున్నేరు అవుతున్నారు.


ఇక ఏడాది జనవరిలో కృష్ణ కుమారుడు  రమేష్ బాబు మరణించక, ఆ కొద్ది నెలలకి తన భార్య ఇందిరా దేవి మరణించగా ,ఇప్పుడు కృష్ణ కూడా మరణించారు. ఈ వార్త మహేష్ బాబుని చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో కృష్ణ మృతికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపిన వారిలో.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ,ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ,సమంత, రవితేజ, శ్రీనువైట్ల ,జగపతిబాబు సునీల్, వెన్నెల కిషోర్ తదితర టెక్నీషియన్లు సైతం కృష్ణకు నివాళులు అర్పించారు. ప్రస్తుతం వారికి సంబంధించి పలు రకాల ట్విట్ట్లు కూడా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: