టాలీవుడ్  సీనియర్  స్టార్ హీరో మెగాస్టార్  చిరంజీవి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో లక్షల మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఆయన డ్యాన్స్ గురించి గ్రేస్ గురించి తెలుగు ప్రేక్షకుడుకి అసలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వయసులో కూడా చాలా సింపుల్ గా డ్యాన్స్ చేయగల సత్తా ఉన్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి.ఇక  ఆయన నటిస్తున్న లేటెస్ట్  చిత్రం వాల్తేరు వీరయ్య. యంగ్  డైరెక్టర్  బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తుండగా.. చిరు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా  నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను ఎంతో విశేషంగా ఆకట్టుకొన్నాయి. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను ఇక మొదలుపెట్టేశారు. ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. బాస్ పార్టీ అనే సాంగ్ ను ఈ నెల 23 వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఈ పాటని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


ఇక పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవిని చూస్తుంటే ముఠా మేస్త్రి గుర్తుకు రాకుండా మానదు. మల్టీకలర్ లుంగీ, టీ షర్ట్, దానిపై చొక్కా, బ్లాక్ షూస్, నోట్లో బీడీ.. టోటల్ గా ఊర మాస్ లుక్ లో కనిపించి ఎంతగానో మెప్పించాడు. మెగాస్టార్ ని ఈ లుక్ లో చుసిన అభిమానులు వింటేజ్ చిరంజీవి అంటూ చెప్పుకొస్తున్నారు. బాస్ పార్టీ లో ఊర్వశి రౌతేలా అందాలు హైలైట్ గా మారనున్నట్లు సమాచారం తెలుస్తోంది. మరి ఈ పాటలో చిరంజీవి మాస్ స్టెప్స్ వింటేజ్ చిరంజీవి గుర్తుచేస్తాయో లేదో చూడాలి.మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ మెగా హీరోలకు, ముఖ్యంగా చిరంజీవికి గతంలో అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఆల్బమ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. బాస్‌ పార్టీ సాంగ్‌లో చిరంజీవి డ్యాన్స్ అదిరిపోనుందని, ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా ఎక్జయిట్‌గా ఉందని దేవి సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: