టాలీవుడ్ లోకి మొదట చైల్డ్ యాక్టర్ గా ఎంతో మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.అందులో కొంతమంది మాత్రమే అగ్ర హీరోలుగా నటించారు. అందులో హీరో తరుణ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఈ హీరో కెరియర్ మొదట్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించిన తరుణ్ నువ్వే కావాలి సినిమాతో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నారు. ఆ తర్వాత నటించిన చిత్రాలు అన్ని కూడా తరుణ్ కెరీర్ కి ప్లస్ గా మిగిలాయి. దీంతో తరుణ్ లవర్ బాయ్ గా కూడా పేరు సంపాదించారు.


అయితే కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కాబట్టి తరుణ్ కూడా డిజాస్టర్లతో కాస్త ఇబ్బంది పడడంతో కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ హీరోగా సినిమాలలో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు.ప్రస్తుతం తన సొంత వ్యాపారాలతోనే బిజినెస్ మాన్ గా పేరు సంపాదిస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం తరుణ్ కు బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలలో మాత్రం నిజం లేదని తెలియజేయడం జరిగింది తరుణ్. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు చురుకుగా కనిపిస్తూ ఉంటారు.తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటారు.తాజాగా తరుణ్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం తో ఈ ఫోటో చూసినా అభిమానులు ఒకప్పటి లవర్ బాయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని కామెంట్లు చేస్తూ ఉన్నారు. తరుణ్ తిరిగి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మంచి కంటెంట్ మాత్రం దొరికితే ఖచ్చితంగా సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. గడిచిన కొద్ది రోజుల క్రితం నువ్వే నువ్వే సినిమాను రిలీజ్ ఫంక్షన్ లో కనిపించారు తరుణ్. మరి రాబోయే రోజుల్లో తరుణ్ కు సెట్ అయ్యే కథలు వస్తాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: