తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికే నిఖిల్ "కార్తికేయ 2" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇది ఇలా ఉంటే కార్తికేయ 2 మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , పల్నాటి వీర ప్రతాప్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి సుకుమార్ కథను అందించగా , గోపి సుందర్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేసింది.  తాజాగా ఈ మూవీ యూనిట్ సినిమా నుండి మూడవ పాట విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ నుండి "ఏడు రంగుల వాన" అనే మూడవ పాటను డిసెంబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బంధం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: