
ఈ భామ అందంగా, స్లిమ్‌గా, ఫిట్ (fitness secrets)గా కనిపించాలంటే ఏం చేయాలో చెప్పింది. ఆ టిప్స్ ఏంటో జాన్వీ మాటల్లోనే..
దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్ (Janhvi Kapoor). శ్రీదేవి అడుగుజాడల్లో నడుస్తూ.. తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉంది జాన్వీకపూర్. మొదట గ్లామరస్ రోల్స్ తో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఆ తర్వాత మెల్లమెల్లగా రూటు మార్చి నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తోంది. సినిమాలతో సంబంధం లేకుండా టైం దొరికిపుడల్లా హాట్ హాట్ లుక్స్‌లో కనిపిస్తూ నెటిజన్ల మనసు దోచేస్తుంటుంది జాన్వీకపూర్.
ఎప్పటికపుడు కొత్త లుక్‌లో క్యూట్‌గా, స్లిమ్‌గా కనిపిస్తూ అభిమానులు, నెటిజన్ల కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తుంటుంది. తన టైం టేబుల్లో ఖచ్చితంగా జిమ్ సెషన్లో ఉండేలా చూసుకుంటుంది జాన్వీ. ఈ భామ అందంగా, స్లిమ్‌గా, ఫిట్ (fitness secrets)గా కనిపించాలంటే ఏం చేయాలో చెప్పింది. ఆ టిప్స్ ఏంటో జాన్వీ మాటల్లోనే..
ఒకప్పుడు బొద్దుగా ఉండేదాన్ని..కానీ
పంజాబీ కుటుంబం నుండి వచ్చిన నేను ఒకప్పుడు బొద్దుగా ఉండేదాన్ని. బొద్దు లుక్ నుంచి స్లిమ్ (Slim Look) గా మారడం ఛాలెంజ్‌గా మారింది. చిన్న, సరళమైన జీవనశైలి మార్పులతో.. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహారపు అలవాట్లతో ఫిట్నెస్ ప్రయాణాన్ని మొదలుపెట్టడం చాలా ముఖ్యం. నేను బేబీ స్టెప్స్‌తో నా ఫిట్నెస్ జర్నీ షురూ చేశాను. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, తాజా పండ్లు, కూరగాయలు నా రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో ముఖ్యమైందని మీకు వాగ్దానం చేస్తున్నా.
బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే..
నా విషయానికొస్తే.. ప్రొటీన్స్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ అంటే ఇష్టం. బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, సఫోలా ఫిట్టీఫై పీనట్ బటర్ లాంటివి బ్రేక్ ఫాస్ట్‌లో ఉండేలా చూసుకుంటా. మధ్యాహ్నం భోజన సమయంలో బయట ఉంటే హోంఫుడ్ మాత్రమే తింటాను. పండ్లు, తాజా కూరగాయల సలాడ్‌ను తీసుకుంటా. ఇక రాత్రి భోజనంలో సులభంగా జీర్ణమయ్యే ఉడికించిన కూరగాయలు, సూప్, గ్రిల్డ్ ఫిష్ ఉండేలా చూసుకుంటా.
ఫిట్నెస్ టిప్స్ లో చాలా ముఖ్యమైంది ఇదే..
ఫిట్నెస్ టిప్స్ లో అన్నిటికంటే ముఖ్యమైంది మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడమని చెప్పింది జాన్వీకపూర్. ఈ విషయం గురించి చెబుతూ.. మీరు ఎంజాయ్ చేసే ఏ స్థితిలోనైనా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. నా విషయానికొస్తే.. కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, పైలేట్స్, స్విమ్మింగ్, యోగా, డ్యాన్స్ సెషన్స్‌ను చాలా ఆస్వాదిస్తూ.. ఎంజాయ్ చేస్తా. యోగా వల్ల నా మనసుకు విశ్రాంతి దొరుకుతుంది. మంచి రిలాక్సేషన్ థెరపీలా పనిచేస్తూ.. బిజీ షెడ్యూల్స్‌లో కూడా సులభంగా పనిచేసేలా నా శరీరాన్ని రెడీ చేస్తుంది..అంటూ ఫిట్ నెస్ రహస్యాలను అభిమానులు, ఫాలోవర్లతో పంచుకుంది జాన్వీకపూర్.