
ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ కూడా కానుంది అని రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు . ఇదిలా ఉండగా ఈ సినిమా తమిళ రీమేక్ హక్కులను తాజాగా తమిళంలో లైగర్ సినిమాను రిలీజ్ చేసిన ఆర్కే సురేష్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ డిసెంబర్ చివరి వారం తమిళనాడులో గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కాబోతోంది. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తమిళ్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి మొత్తానికైతే ఈ సినిమా అటు తెలుగు ఇటు తమిళ్లో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మరి చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతి కానుక జనవరి 13వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న భోళా శంకర్ సినిమా కూడా విడుదలకు సిద్ధం కాబోతోంది. ఏది ఏమైనా ఈ వయసులో కూడా చిరంజీవి ఇలా గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు.